రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

క్రైం తాండూరు వికారాబాద్

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
– తాండూరు, రుక్మాపూర్ మార్గంలో ఘటన
– కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: రైలు ఢీకొని ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈసంఘటన గురువారం తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 07:30 గంటల సమయంలో తాండూరు -రుక్మాపూర్ రైల్వే స్టేషన్ ల మధ్యన దాదాపు 50 ఏండ్ల వయస్సు ఉన్న ఓగుర్తు తెలియని వ్యక్తిని Km No. 74/16-18 దగ్గర రైలు ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి పట్టాల ప్రక్కన ఉన్న మోరీలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని పరిశీలించగా ఎలాంటి వివరాలు లభించలేదు. అతని ఒంటిపై డబ్బాలు గల లుంగీ, తెలుపు రంగు కమిస్ షర్ట్, పసుపు పచ్చ రంగు టవలు, తెల్లని గడ్డము కలిగి ఉన్నట్లు తెలిపారు. వికారాబాద్ స్టేషన్ మాస్టర్ పిర్యాదు తో కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుని వివరాలు తెలిస్తే రైల్వే పోలీసు అధికారి మల్లయ్య సెల్: 9440700035కు సంప్రదించాలని సూచించారు.