హ్యాపీ బర్త్ డే రాజన్నా..!
– అట్టహాసంగా రాజ్ కుమార్ జన్మదిన వేడుకలు
– పండగలా పలు సేవా కార్యక్రమాలు
– శుభాకాంక్షలు తెలిపిన నేతలు, ప్రముఖులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వెనుకబడిన బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాడే నాయకుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ జన్మదిన వేడుకలు తాండూరులో అట్టహాసంగా జరిగాయి.

శుక్రవారం రాజ్ కుమార్ జన్మదినం సందర్భంగా యువజన సంఘాల సభ్యులు, అభిమానులు, సన్నిహితులు ఆయన జన్మదినాన్ని పండగలా జరుపుకున్నారు. పిల్లలకు, విద్యార్థులకు, మహిళలకు పలు సేవా కార్యక్రమాలతో ఉత్సహాంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు రాజ్ కుమార్ హాజరై నాయకులతో పాటు ప్రజలతో సందడి చేశారు. బషీరాబాద్ మండలం రెడ్డిఘనపూర్ లో మండల అధ్యక్షులు నరేందర్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు టైలు, బెల్ట్లు పలకలు, ప్యాడ్లు పంపిణీ చేశారు. యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో యాలాల్ మండల్ అధ్యక్షులు లక్ష్మణ చారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు.

తాండూర్ పట్టణం టైలర్ రమేష్ అనిత ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. రాజీవ్ కాలనీలో బీసీ మహిళా ఉపాధ్యక్షురాలు అనిత ఆధ్వర్యంలో అంగన్వాడి విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాండూరు పట్టణంలో ఎంపీటీఎల్ వద్ద అంగన్వాడి కేంద్రంలో బీసీ మహిళా కార్యదర్శి మంజుల ఆధ్వర్యంలో అంగన్వాడి విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అదేవిధంగా మాత శిశు ఆసుపత్రిలో రాము ముదిరాజ్, జుంటుపల్లి వెంకట్ నేతృత్వంలో ఉదయం అల్పారము, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. పట్టణంలోని కాళికాదేవి మందిరంలో తాండూరు నియోజకవర్గ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో రాజ్ కుమార్ ను గజమాలతో ఘన సన్మానం నిర్వహించి శాలువాలతో సత్కరించారు. కందేనెల్లి గ్రామంలో వికారాబాద్ జిల్లా బిసి మహిళా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి ఆధ్వర్యంలో వృద్ధులకు చేతి కర్రలను ఉచిత పంపిణీ చేశారు.

తాండూరు నియోజకవర్గ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రాజ్ కుమార్ జన్మదిన వేడుకలను వివిధ పార్టీలకు చెందిన నాయకులు కుల సంఘాల పెద్దలు యువజన సంఘ నాయకులు పూలమాలతో శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత శంకర్ యాదవ్, బీసీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ సుకూర్, పట్లోళ్ల నర్సింలు బాల్ రెడ్డి, మనోహర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, డాక్టర్ సంపత్ కుమార్, శ్రీనివాస్ చారి, అనిల్ బాండ్, రమేష్ టైలర్, రాము ముదిరాజ్, ముదిరాజ్ యువజన సంఘం తాండూర్ నియోజకవర్గ అధ్యక్షులు ఎస్పీ రవికాంత్, శ్రీకాంత్, బంటు మల్లప్ప, రాము ముదిరాజ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బసవరాజ్, అమ్రేష్, బసంత్ కుమార్, జగదీష్, వై వెంకట్, బోయ రాధాకృష్ణ, రజక నరసింహ తదితరులు పాల్గొన్నారు.

