మృతురాలి కుటుంబానికి చేయూత

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrమృతురాలి కుటుంబానికి చేయూత
– ఆర్థిక సాయం అందజేసిన పట్లోళ్ల నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు చేయూతనందించారు. కుటుంబానికి రూ. 10వేల ఆర్థిక సాయం అందజేశారు. తాండూరు పట్టణం సాయిపూర్‌ 10వ వార్డు భవాని నగర్‌కు చెందిన గౌరమ్మ అనే మహిళ మృతి చెందింది.

మంగళవారం ఈ విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల రత్నమాల భర్త, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు హన్మంతును పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఓదార్చారు. అనంతరం తనవంతుగా కుటుంబానికి రూ. 10వేల ఆర్థిక సాయం అందజేశారు. ఇందుకు హన్మంతు పట్లోళ్ల నర్సింలుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

మొలకెత్తిన గోధుమలలో ఆరోగ్యం మెండు