మిల్లెటోపియాలో మెరిసిన విద్యార్థులు

కెరీర్ తాండూరు వికారాబాద్

మిల్లెటోపియాలో మెరిసిన విద్యార్థులు
– శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ విద్యార్థుల ప్రతిభ
– అభినందించిన యజమాన్యం, తల్లిదండ్రులు
తాండూరు, దర్శని ప్రతినిధి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నిర్వహించిన మిల్లెటోపీయా పోటీలో తాండూరుకు చెందిన శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ విద్యార్థులు మెరిశారు. ఇటీవల జరిగిన ఈ పోటీలలో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 800 మంది పైచిలుకు విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ పోటీలో పారా రైటింగ్ విభాగంలో స్కూల్కు చెందిన కె. అపూర్వ ద్వితీయ బహుమతి, విష్ణుతేజ తృతీయ బహుమతి సాధించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైస్ ఛాన్స్లర్ బాసుత్కర్ జగదీశ్వర్ రావు చేతుల మీదుగా బహమతులు అందుకున్నారు. మిల్లెటోపీయా పోటీలో విద్యార్థులు ప్రతిభ కనబరచడం పట్ల మంగళవారం స్కూల్ డైరెక్టర్ మణిమాల, ప్రిన్సిపల్ శివలీల తదితరులు అభినందించారు. చదువుతో పాటు పోటీలలో విద్యార్థులు ప్రతిభను కనబరచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.