ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
– వాడ వాడలా ఎగిరిన జాతీయ జెండా
– ఆవిష్కరించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు
– క్యాంపు కార్యాలయంలో జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తాండూరులోని ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీ కార్యాలయాలు, సంఘాల కార్యాలయాలతో పాలు వాడ వాడలన్నీ త్రివర్ణ శోభితంగా మారాయి. వాడ వాడలా ఎగిరిన మువ్వెన్నెల జెండా మురిసిపోయింది. తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, తాండూరు ఆర్డీఓ కార్యాలయం, పాత తాండూరు అంబేద్కర్ పార్కు, మున్సిపల్ నూతన కార్యాలయంలో ఆర్డీఓ అశోక్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కౌన్సిలర్లు, నాయకులతో కలసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జెండా ఎగురవేశారు. అదేవిధంగా తాండూరు డీఎస్పీ కార్యాలయంలో, పట్టణ పోలీస్టేషన్లో, జిల్లా ఆసుపత్రిలో, మార్కెట్ కమిటిలో, మాతా శిశు ఆసుపత్రిలో, తాండూరు న్యాయస్థానంలో, వివిధ కార్యాలయాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా శాఖల అధికారులు, సంఘాల ఆధ్వర్యంలో ప్రతినిధులు, అంగన్ వాడి కేంద్రాల్లో కౌన్సిలర్లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, దేవాలయాల చైర్మన్లు, ప్రభుత్వ శాఖల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ కార్యాలయాలలో జెండా పండగ
మరోవైపు తాండూరు పట్టణంలోని పార్టీల కార్యాలయాలో జెండా పండుగను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, తదితర పార్టీల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జాతీయ జెండా సంబరాలలో పాల్గొన్న అధికారులు, నేతలు





