రేపు తాండూరులో పవర్ కట్
– ప్రకటించిన విద్యుత్ అధికారులు
– అంతరాయం ఎక్కడ కలిగిస్తున్నారంటే
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో రేపు పవర్ కట్ చేస్తున్నట్లు స్థానిక విద్యుత్ అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం పట్టణ విద్యుత్ శాఖ అధికారులు ప్రకటన జారీ చేశారు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ స్థంబాల మరమ్మత్తులు చేపట్టం జరుగుతుందన్నారు. ఈ కారణఃగా పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుంచి శివాజీ చౌక్ ప్రాంతాలు, సీసీఐ కాలనీ, హమాలి బస్తీ, గౌతాపూర్ మార్గంలో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు వివరించారు. ఆదివారం ఉదయం 9-30 గంటల నుంచి సాయంత్రం 4-30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని వెల్లడించారు. ఇందుకు విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

