బడ్జెట్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

బడ్జెట్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి
– రూ. 20 వేల కోట్లు కేటాయించాలి
– 2017 నాటి తీర్మానాలను అమలు చేయాలి
– బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె.రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం తాండూరు పట్టణంలో బీసీ నాయకులతో కలిసి కందుకూరి రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం 2017లో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో 210 తీర్మానాలు ప్రవేశ పెట్టి ఆమోదించిందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను ఇంకా అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం ఈ నెల 6న ప్రవేశ పెడుతున్న బడ్జెట్ లో బీసీలకు రూ. 20 వేల కోట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏడేళ్ల క్రితం వివిధ కార్పోరేషన్ల ద్వారా రుణాల కోసం దరఖాస్తున్న లబ్దిదారులకు రుణాలను మంజూరు చేయాలన్నారు. ఎంబీసీ కార్పోరేషన్ కు రూ. 2వేల కోట్లు, 12 బీసీ కులాల ఫెడరేషన్ లకు రూ.2 వేల కోట్లు కేటాయించాలన్నారు. విదేశీ విద్య రుణాలను రూ.300 కోట్లకు పెంచాలన్నారు. రాష్ట్రంలోని 271 గురుకాలుకు. 300 సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాల కోపం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మండలాల అధ్యక్షులు లక్ష్మణ చారి. నరేందర్, బసంత్, కార్యదర్శి బోయా రాధాకృష్ణ, సోషల్ మీడియా ఇంచార్జ్ బస్సు, యువ నాయకులు రాము ముదిరాజ్, జుంటుపల్లి వెంకట్, శ్రీనివాస్, అజిత్ ఠాకూర్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.