జాతీయ లోక్ అదాలత్‌లో 177 కేసుల రాజీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా 177 కేసులు రాజీ అయ్యాయి. కోర్టు న్యాయమూర్తి టీ.స్వప్న ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా న్యాయమూర్తి కేసుల రాజీకోసం వచ్చిన కక్షిదారులతో మాట్లాడి పలు కేసులను కొట్టి వేశారు. ఉదయం నుంచి సాగిన లోక్ అదాలత్‌లో 44 సీసీ కేసులు, 4 ఎంసీ కేసులు, 1 డీవీసీ కేసు, 4 ఓఎస్ కేసులు, 1 ఎస్టీసీ కేసు, 26 ఏఐ యాక్టు కేసులు, 44 సీసీ అడ్మీషన్ కేసులు, 53 పీటీ కేసులు, 1 ఓఎస్(నాట్ ప్రెస్‌డ్) కేసులు రాజీ అయ్యాయి. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ మెంబర్ లు బస్వరాజ్, రాంరెడ్డి, బార్ అసోసియేషన్ కార్యదర్శి పాశం రవి, ఉపాధ్యక్షులు గోపాల్, కోశాధికారి నాదిర్గే సుదర్శన్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
