వినీష విక్టరీ..!

కెరీర్ తాండూరు తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

వినీష విక్టరీ..!
– ఎడ్‌ సెట్‌ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్
– తాండూరు అమ్మాయికే మొదటి స్థానం
– మెరిసిన సింధూ కాలేజీ స్టూడెంట్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు అమ్మాయి తెలంగాణ రాష్ట్ర ఎడ్ సెట్ ఫలితాలలో విక్టరీ సృష్టించింది. తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే ఫస్ట్ ర్యాంకు సాధించింది మెరిసింది. సోమవారం విడుదలైన బీఈడీ ప్రవేశ ఎడ్ సెట్ ఫలితాల్లో తాండూరుకు చెందిన అమ్మాయి వినీష తొలిర్యాంకు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణంలోని గ్రీన్ సిటి కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు గొల్ల మొగులప్ప కుమార్తె గొల్ల వినీష స్థానికంగా ఉన్న సింధూ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుకోంది. గత నెల మే 18న బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్ సెట్ పరీక్షకు హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో వినీష రాష్ట్రంలోనే తొలి ర్యాంకు సాధించగా హైదరాబాద్ కు చెందిన నిశా కుమారి రెండో ర్యాంకు సాధించింది. ఫలితాల్లో వినీషకు ఎడ్ సెట్ లో 150 మార్కులకు గాను 117.4 మార్కులు వచ్చాయి. దీంతో వినీష రాష్ట్రంలోనే తొలి ర్యాంకు సాధించింది. మరోవైపు వినీష రాష్ట్రంలోనే తొలి ర్యాంకు సాధించడం పట్ల సింధు డిగ్రీ కళాశాల వ్యవస్థాపకులు వి.రంగారావు, ప్రిన్సిపల్ విజయాదేవి, స్టాఫ్ ఆమెను అభినందించారు. మునుముందు మరిన్ని ఉన్నత శిఖరాలను సాధించాలని ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి…

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

chaithany collage