కుక్కను తప్పించబోయి ఆటో బొల్తా
– గాయాలతో వ్యక్తి దుర్మరణం
– కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలై ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఆదివారం తాండూరు పట్టణం గౌతాపూర్ రోడ్డు మార్గంలో చోటు చేసుంది. కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నరేష్ అనే వ్యక్తికి చెందిన ఆటో(టీఎస్ 7 యూవీ 5688) లో ప్రయాణికులతో వస్తోంది. మార్గమద్యలో ఆటోకు ఎదురుగా కుక్క ఎదురురావడంతో దానిని తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పట్లోళ్ల బస్వరాజ్ పాటిల్(56) అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించగా… మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో మరికొందరి ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. మృతుని పెద్ద కుమారుడు మున్నెప్ప పాటిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ ఐ మధుసూధన్ రెడ్డి తెలిపారు.
ఇది కూడా చదవండి…

