పైలెట్‌కు విక్టరీ విజయం ఖాయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్‌కు విక్టరీ విజయం ఖాయం..!
– భారీ మెజార్టీ అందించడమే లక్ష్యం
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
– ఎమ్మెల్యేకు శుభాకంక్షలు తెలిపిన కౌన్సిలర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో తాండూరు ఎమ్మెల్యే పైలేబ్ రోహిత్ రెడ్డి విక్టరీ విజయాన్ని అందించి రెండోసారి అసెంబ్లీకీ పంపడమే ధ్యేయమని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పైలెట్ రోహిత్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా శుక్రవారం ఆమె హైదరాబాద్లో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి ఆర్తిరెడ్డిలను సమేతంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రగతి సాధకుడుగా నిలిచిన ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ నుంచి టిక్కెట్టు రావడం హర్షణీయమన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పైలెట్ రోహిత్ రెడ్డికి భారీ మెజార్టీ అందించి రెండోసారి అసెంబ్లీకి పంపించడమే లక్ష్యమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామిలతో పాటు సంక్షేమం, అభివృద్ధికి కృషి చేసిన రోహిత్ రెడ్డిని ప్రజలు నమ్మకంతో గెలిపించుకోవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, ఆసిఫ్, వరాల శ్రీనివాస్ రెడ్డి, అస్లాం, ఆశ్విని గుండప్ప, వెంకన్న గౌడ్, భీంసింగ్, కోఆప్షన్ సభ్యులు వెంకట్రామ్ నాయక్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!