దళిత బందు వసూళ్లపై పైలెట్ హెచ్చరిక
– పథకంలో వసూళ్లు చేస్తే పీడీ యాక్డుకు ఆదేశం
– అమలుపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు వెల్లడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో కమీషన్ల పర్వం కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. కొందరు బ్రోకర్లు మద్యవర్తులుగా మారీ కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. వికారాబాద్ జిల్లా తాండూరులో జరుగుతున్న పరిణామాలపై స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్పందించారు.
దళిత బంధు పథకం మంజూరులో ఎవరైన డబ్బులు తీసుకుంటే వారిపై పీడీయాక్టు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదని పేర్కొన్నారు. దరఖాస్తుల విచారణకు వచ్చే అధికారులు కానీ, సిస్టంలో ఫీడ్ చేసే సిబ్బంది కానీ, డబ్బులు డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలని లబ్ధిదారులకు సూచించారు.
ఈ పథకం అమలుపై నిఘా ఉంచుతామన్నారు. లబ్ధిదారులు కూడా ఎవరైనా లంచం ఇచ్చే ప్రయత్నం చేస్తే వారికి దళిత బంధు పథకం రద్దుచేసి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు కానీ నాయకులు, మధ్యవర్తులు ఎవరైనా సరే అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.
ఇది కూడ చదవండి..

