విద్యార్థులకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు
– తాండూరు జూనియర్ సివిల్ జడ్జి శివలీల
– గురుకుల, వసతి గృహాల తనిఖీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : గురుకుల, సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు ఇబ్బందులు, అసౌకర్యాలు కలిగిస్తే చర్యలు తప్పవని తాండూరు జూనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ చైర్ పర్సన్ శివలీల అన్నారు. శనివారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, బీసీ, ఎస్సీ, బాలుర వసతి గృహాలను న్యాయమూర్తి శివలీల అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా వసతి గృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనంతో పాటు ఇతర వస్తువులు, సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు స్వయంగా భోజనం చేసి వడ్డించాలని సూచించారు. ఎస్సీ బాలుర వసతి గృహంలో వార్డెన్, అటెండర్లు అందుబాటులో లె రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులకు అసౌకర్యాలు కల్పించినా, ఇబ్బందులకు గురి చేసిన మండల లీగల్ సర్వీసు కమిటీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పాశం రవికుమార్, న్యాయవ్యాదులు, వసతిగృహాల నిర్వహకులు తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

