గౌస్ కైసా హై..!
– జర్నలిస్టును పరామర్శించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన జర్నలిస్టు గౌస్‌ను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అప్యాయంగా పలకరించారు. జర్నలిస్టు గౌస్ ఇటీవలే అనారోగ్యానికి గురై కిడ్నీ స్టోన్స్ కి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకొని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. శనివారం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వారి నివాసానికి వెళ్ళి గౌస్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొన్నారు. అధైర్య పడొద్దని తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని గౌస్ కు ధైర్యం చెప్పారు. పూర్తిస్థాయిలో కోలుకునే వరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అనంతరం గౌస్.. తన ఇంటికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మొదటిసారి రావడంతో ఆయనను ఘనంగా సన్మానించారు.
ఎమ్మెల్సీ వెంట టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, పెద్దేముల్ సొసైటీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వంత్ రెడ్డి, మైనారిటీ నాయకుడు Md. ఆజం ఖాన్, రేగొండి సర్పంచ్ హైదర్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింహులు, టీఆర్ఎస్‌వై రాష్ట్ర నాయకులు బిర్కడ్ రఘు, అశోక్ ముదిరాజ్, తాండ్ర రాకేష్, సుల్తాన్, సమీ, అంబరీష్, వసీం, కోట్ల రాజ్ కుమార్ రెడ్డి, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

