బీసీ నేతను స్మరించుకుందాం..!
– రేపు మాణిక్ రావు వర్దంతిలో పాల్గొనండి
– కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన బీసీ నేత స్వర్గీయ మాజీ మంత్రి మాణిక్ రావు మహారాజ్‌ను స్మరించుకుందామని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ అన్నారు. రేపు తాండూరులో మాణిక్ రావు మహరాజ్ వర్ధంతిని నిర్వహిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మాణిక్ రావు 7వ వర్ధంతికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఉదయం 10-30 గంటలకు పట్టణంలోని డీసీఎంఎస్ కార్యాలయ గేటు సమీపంలో ఉన్న మాణిక్ రావు మహారాజ్ విగ్రహానికి నివాళులు అర్పించడండం జరుగుతుందన్నారు. కావున పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎ సయూఐ, మైనార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి…

