రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించాలి
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి
– ప్రార్థన ఆసుపత్రి వైద్యులను అభినందించిన ఎమ్మెల్సీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పేదలకు నాణ్యమైన వైద్యసేవలను అందించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అన్నారు. ఇటీవల బస్టాండ్ సమీపంలో ప్రార్థన ఆసుపత్రి ప్రారంభయ్యింది. ఆదివారం ఆసుపత్రిని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి డైరెక్టర్లు డాక్టర్ జైదీప్, డాక్టర్ కరీష్మాలు ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో పేదల బతుకులన్నీ చితికిపోయాయన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పేదలకు భరోసా కలిగిలే నాణ్యమైన వైద్య సేవలందించాలని ఆసుపత్రి డైరెక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, యువనాయకులు అశోక్ తదితరులు న్నారు.
