అపదలో ఉంటే డయల్ 100కు కాల్ చేయాలి
– మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తే జైలు శిక్ష తప్పదు
– పెద్దేముల్‌లో ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు
పెద్దేముల్, దర్శని ప్రతినిధి: అత్యవసరం.. ఆపదలో ఉన్నప్పుడే డయల్ 100కు కాల్ చేయాలని పెద్దేముల్ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. మంగళవారం పెద్దేముల్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ట్రైనింగ్ ఎస్సై అరవింద్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో జరిగిన సంతలో కానిస్టేబుల్స్ వెంకట్ రామ్ రెడ్డి, కే.రాజులు సీసీ కెమెరాలతో పాటు డయల్ 100పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా ఆపదలో ఉంటే.. అత్యవసర పరిస్థితిలో ఉంటే వారికి సత్వర న్యాయం చేసేందుకు ప్రభుత్వాలు డయల్ 100ను ప్రవేశ పెట్టారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని చిన్న చిన్న విషయాలకు కాకుండా అత్యవసర, ఆపద సమయాల్లోనే 100కు కాల్ చేయాలని సూచించారు. అదేవిధంగా నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీని ఆధారంగా ఎవరైనా అల్లర్లు, అఘాయిత్యాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో పాటు గ్రామాల్లో ఎవరైనా మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారని సూచించారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవరు వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
