మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పటేల్ ఉమాశంకర్‌కు సన్మానం
– శుభాకాంక్షలు తెలిపిన శకుంతల దేశ్ పాండే
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ పటేల్ ఉమాశంకర్ ను బీఆర్ఎస్ తాండూరు మహిళ కన్వినర్ శకుంతల దేశ్‌పాండే సన్మానించారు. మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ గా పటేల్ ఉమాశంకర్ నియామకం అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం మహిళ కన్వీనర్ శకుంతల దేశ్ పాండే గౌతాపూర్‌లో పటేల్ ఉమాశంకర్ ను సన్మానించారు. ఎల్లుండి బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తోన్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి… అభినందించారు. మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ గా తనదైన ముద్రవేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

