మా సపోర్టు రోహిత్ రెడ్డికే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మా సపోర్టు రోహిత్ రెడ్డికే..!
– ఎమ్మెల్యేకు మద్దతు తెలిపిన ఉద్యమకారులు
– ఉద్యమకారులతో సమావేశమైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మా సపోర్టు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికే అందిస్తామని తాండూరు తెలంగాణ ఉద్యమ కారులు అన్నారు. బుధవారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరుకు చెందిన ఉద్యమ కారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తెగించి పోరాడిన విధంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తామని అన్నారు. ఎన్నికల్లో పూర్తి మద్దతు అందిస్తామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో తాండూరు అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితోనే సాధ్యమతుందని ధీమా వ్యక్తం చేసినట్లు నేతలు తెలిపారు. ఉద్యమ కారులు మద్దతు అందించేందుకు ముందుకు రావడం పట్ల ఎమ్మెల్యే రోహత్ రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేతో భేటీ అయిన ఉద్యమ కారులలో వీరమణి, ముజీబ్, నాగేందర్, పోల శ్రీను, దత్తు, ప్రకాష్ గౌడ్‌, గయాజ్ పాటు బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత