పేదల గుండె చప్పుడు కాంగ్రెస్..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

పేదల గుండె చప్పుడు కాంగ్రెస్..!
– ప్రజా అవసరాలు తీర్చేలా పాలన
– అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు
– ప్రపంచ పోటీ పడేలా ఇంటిగ్రేటేడ్ స్కూళ్లు
– కాగ్నానదిలో లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరుకు కృషి
– తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
– తాండూరు డీప్యూటీ సీఎం అభివృద్ధి పనులపై పర్యటన
– ఇంచార్జ్ మంత్రి, స్పీకర్, చీఫ్ విప్‌లతో కలిసి శంకుస్థాపనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల గుండె చప్పుడు విని.. ప్రజా అవసరాలను తీర్చేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

మంగళవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలం దౌలాపూర్ వద్ద రూ. 200 కోట్లతో చేపట్టే యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్ తో పాటు నియోజకవర్గంకు మంజూరైన సుమారు రూ. 20 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కొండాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్, చెన్ గేష్ పూర్ సబ్ స్టేషన్, నారాయణపూర్ సబ్ స్టేషన్, బెల్కటూర్ సబ్ స్టేషన్, పాషాపూర్ సబ్ స్టేషన్, హాజీపూర్ సబ్ స్టేషన్ లకు శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా తాండూరు పట్టణంలోని రూ. 35లక్షలతో చేపట్టే స్వాగత తోరణాలకు, రూ. 7కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరై ఐటీ శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డిలతో కలిసి శంకుస్థాపనలు చేశారు. అనంతరం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని జీపీఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్దిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పేదల గుండె చప్పుడులా పనిచేస్తుందని అన్నారు. ప్రజా పాలనతో ప్రజల అవసరాలను తెలుసుకుని అభివృద్ధి సంక్షేమం చేపడుతోందని అన్నారు. గత పదేళ్లు పాలించిన గత ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు, ఇండ్లు ఇవ్వలేదన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని 95లక్షల కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేసిందన్నారు. అర్హులైన పేదలందరికి సన్నబియ్యం అందిస్తోందని అన్నారు. కేవలం రేషన్ బియ్యం కాకుండా కార్డు ద్వారా అందే ఆరోగ్య సేవలు, ప్రభుత్వ పథకాలు అందించేందుకు కృషి చేస్తోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామిలను -నెరవేర్చుకుంటూ వస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కింద రాష్ట్రంలో 4లక్షల 50వేల ఇళ్లను రూ.22 వేల 500కోట్లతో ఈ యేడాది నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు.

బిల్లుల విషయంలో లబ్దిదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రతి వారం బిల్లులు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిరుద్యోగులకు 70వేల ఉద్యోగాలు, పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, పేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేదింటి పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు ఇంటి గేట్రేడ్ స్కూళ్లు, పై చదువులకు ఆర్థిక సాయం, యువత సొంత వ్యాపారాలకు రుణాలు, పదేళ్లుగా ఆగిపోయిన వడ్డి రుణాల కింద మహిళలకు లక్షల కోట్ల రుణాలు అందించేందుకు దృష్టి సారిస్తూ కోటి మహిళలను కోటిశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందించడం జరుగుతుందని, వికారాబాద్ జిల్లాలో 157 599 వినియోగదారులకు 74శాతం లబ్దిదారులకు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు.

ప్రజల అవసరాలు తీర్చేలా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుంచి ఆలోచన చేస్తున్నారని అన్నారు. విద్యారంగానికి పెద్ద పీట వేస్తూ పేదల విద్యార్థులు ప్రపంచంతో పోటే ప విధంగా.. గేమ్ చెంజర్ లా మార్చేందుకు 104 ఇంటిగ్రేటేడ్ స్కూళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తాండూరు నియోజవర్గానికి 132 సబ్ స్టేషన్ ఏర్పాటుకు పరిశీలన చేస్తామన్నారు. కాగ్నానదిలో నీరు వృధా పోకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు.

అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో పారిశ్రామిక వాడతో పాటు జిల్లాలో రోడ్లను అభివృద్ధి పరించేందుకు తోడ్పాటు అందిస్తామన్నారు. అదేవిధంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి, సంక్షేమానికి నిధులు మంజూరు చేస్తోందన్నారు. కోట్ పల్లి ప్రాజెక్టుకు 90 కోట్లు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. తాండూరులో బైపాస్ రోడ్డు, పారిశ్రామిక వాడ సమస్యలను పరిష్కరించేలా చూడాలన్నారు.

నియోజకవర్గంలో మరో రెండు విద్యుత్ సబ్ స్టేషన్లను మంజూరు చేయాలని కోరారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిలుక వాగు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ హార్డ్ చౌదరి, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత, ఫైనాన్స్ కమీషన్ మెంబర్ రమేష్ మహారాజ్, ఆర్బీఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ జిల్లా చైర్మన్ సత్తయ్య, వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు డా. సంపత్ కుమార్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జుబేర్ లాల, నాయకులు హబీబ్ లాల, కావలి సంతోష్ కుమార్, బంటు వేణుగోపాల్, బిడ్కర్ రఘు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శోభారాణి, పట్టణ అధ్యక్షురాలు గాజుల మాధవి, తాండూరు మండల అధ్యక్షులు జన్నె నాగప్ప, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరోవైపు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో పట్టణ సీఐ సంతోష్ కుమార్, రూరల్ సీఐ నగేష్ ఆధ్వర్యంలో పోలీసులు, బద్రతా బలగాలు బందోబస్తు నిర్వహించారు.

ఇదికూడా చదవండి..

నాగదేవతల్లారా.. దీవీంచండి..!