గ్యారెంటీగా మద్దతివ్వాలి..!
– అధికారంలోకి వచ్చేది హస్తమే
– డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం గ్యారెంటీగా మద్దతు ఇవ్వాలని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత తాండూరు నిజాం షాహీ దర్గా నుంచి యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడి నుంచి గడి, కోటేశ్వర దేవాలయం. జమా మసీదు, కర్బలా మైదాన్, పోచమ్మ గుడి, తెలుగు గడ్డ, రైల్వే గేటు, ముర్షద్ దర్గా, గాంధీ చౌక్, భద్రేశ్వర చౌక్, మార్వాడీ బజార్, సమద్ ఫంక్షన్ హాల్ వైపు కొనసాగింది. ఈ ర్యాలీలో నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చె సిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, అందుకనే ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించిందన్నారు. ప్రజలు గ్యారెంటీతో కాంగ్రెస్ గెలుపుకు మద్దతు ఇవ్వాలన్నారు. వచ్చే ఎన్నికల్లో హస్తందే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్. ఆర్బీఎల్ శ్రీనివాస్ రెడ్డి, సాయిపూర్ బాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, మసూద్, స్పోక్ పర్సన్ కల్వ సుజాత, కౌన్సిలర్ నీరజాబాల్ రెడ్డి, మాధవి, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, నారా అశోక్, నాయకులు తాండ్ర రాకేష్, నాగేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

