శాస్త్రవేత్తల కృషితో కందికి గుర్తింపు..!
– తాండూరు పరిశోధన స్థానం కృషి భేష్
– పరిశోధన స్థానంను సందర్శించిన సీఎస్తీ కమిటి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కందికి దేశవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు రావడంలో వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల కృషి భేష్ అని హైదరాబాద్ సెంటర్ ఫర్ సోషియల్ డెవలప్ మెంట్ (సీఎస్మీ కమిటి సభ్యులు ప్రసంశించారు. ఢీల్లి కేంద్రంగా పనిచేస్తున్న కౌన్సిల్ ఆఫ్ సోషియల్ సైన్స్ రీసెర్చ్ సంస్థలో భాగమైన సీఎస్తీ సభ్యులు డా.సౌమ్య వినయన్ ఆధ్వర్యంలో బృందం సభ్యులు బుధవారం తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంను సందర్శించారు. తాండూరు పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. సుధారాణి భౌగోళిక గుర్తింపుతో తాండూరు కంది ఉత్పత్తికి పెరుగుతున్న ఆదరణ, మార్కట్ లో డిమాండ్ ను వివరించారు. గుర్తింపు వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు.
డా. సుధాకర్ మాట్లాడుతూ తాండూరు కందిలో అనేక పోషక విలువలు ఉన్నాయని అన్నారు. దీని ద్వారా తాండూరు ప్రాంత రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచడంలో కంది పాత్ర కీలకంగా మారిందన్నారు. మరోవైపు ట్రస్టీ- ఓ – వన్ సంస్థ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ప్రబీర్ మిశ్ర మాట్లాడుతూ కందిలో నాణ్యతను కాపాడుకోవడంతో పాటు కల్తీని నివారించడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి వివరించారు. పరిశోధన స్థానంను సందర్శించిన సీఎస్టీ కమిటి సభ్యులు మాట్లాడుతూ కందికి భౌగోళిక గుర్తింపు రావడంలో తాండూరు శాస్త్రవేత్తల కృషిని ప్రసంశించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా. రాజేశ్వర్ రెడ్డి, ప్రో.టీకే విశ్వనాథన్, ప్రో. ఎంపద్మావతి, డా. విష్ణు శ్రీరాజన్, మనోజ్, ట్రస్టీఓ వన్ ప్రతినిధులు అజయ్ ఎలమంచి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

