వృద్ధులకు వెచ్చని చేయూత
– మార్వాడి మంచ్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆదర్శవంతమైన సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టే మార్వాడి యువమంచ్ నిరపేద వృద్ధులకు వెచ్చని చేయూతనందించింది. చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి దుప్పట్లను పంపిణీ చేసింది. ఆదివారం నియోజకవర్గం పెద్దేముల్ మండలంలోని బండమీదిపల్లి గ్రామంలో దుప్పట్లను అందజేశారు. ఈ సందర్భంగా మార్వాడి యువమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సర్దా మాట్లాడుతూ సమాజంలోని నందకిషోర్ పర్తాని, సంపత్ కుమార్ రాఠి, ముఖేష్ అగ్రవాల్ ఆర్థిక సహాయంతో 50 మంది వృద్ధులకు అందజేయడం జరిగిందని చెప్పారు. చలికాలంను దృష్టిలో ఉంచుకుని ప్రతి యేడాది మాదిరిగానే దుప్పట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్వాడి యువ మంచ్ అధ్యక్షులు సన్ని అగ్రవాల్, కిషన్ గోపాల్ రాఠి, మహేష్ సర్డా, సచిన్ రాఠి, ముఖేష్ అగ్రవాల్, క్రిష్ణా బూబ్, నిఖిల్ గగ్రాని, గ్రామ సర్పంచ్ రమేష్, ఉపసర్పంచ్, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

