అమ్మా మీ బిడ్డను మరవొద్దు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అమ్మా మీ బిడ్డను మరవొద్దు..!
– ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆదరించండి
– ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అమ్మా.. తాండూరును అభివృద్ధి చేసిన మీ బిడ్డను మరువొద్దని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె గత వారం రోజులుగా బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరుపున జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని 1వ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. బీఆర్ఎస్ పార్టీ మెనిఫెస్టోతో పాటు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు.

అమ్మలను, అక్కలను, అవ్వలను, తాతలను పలకరిస్తూ బీఆర్ఎస్ పార్టీని, మీ బిడ్డగా సేవ చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మరవొద్దని అభ్యర్థిస్తున్నారు. ఆర్తి రెడ్డి ప్రచారానికి ప్రజలు ఫిదా అవుతున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభారాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమళ, పట్టణ అధ్యక్షురాలు సంగీత ఠాకూర్, టైలర్ రమేష్, సిరి యాదవ్, మహిళ నాయకురాలు అనిత, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..