ఓటెత్తిన యువత

తాండూరు రాజకీయం వికారాబాద్

ఓటెత్తిన యువత
– ఆదర్శంగా పాత తాండూరు యువకులు
– హక్కును వినియోగంచుకున్న హన్మంతు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అసెంబ్లీ ఎన్నికల్లో యువకులు ఓటెత్తారు. ముఖ్యంగా తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు యువకులు ఓటు హక్కు వినియోగంలో ఆదర్శంగా నిలిశారు. గురువారం ఉదయం నుంచి పట్టణంలోని అన్ని పోలింగ్ కేంద్రాలతో పాటు పాత తాండూరులోని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రారంభమైంది. దీంతో పాత తాండూరులోని పలు పార్టీల నేతలు, యువకులు ఓటు హక్కు వినియోగానికి చైతన్యం కల్పించారు. బీఆర్ఎస్ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు నీరటి హన్మంతు, యువకులు అబ్రార్ లాల తదితరులు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అనంతరం పాత తాండూరు ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అందరు బాధ్యతగా ఓటు వేయాలని సందేశం ఇచ్చారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!