గాంధీజీ ఆశయాలే ఆదర్శం
– కాంగ్రెస్ టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశానికి స్వాతంత్ర్యం తీసుకవచ్చిన మహాత్మ గాంధీజీ ఆశయాలు అందరికి ఆదర్శనీయమని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహారాజ్ అన్నారు. శనివారం గాంధీ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఉన్న గాంధీ విగ్రహానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహారాజ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా పార్టీ నాయకులు గాంధీజీకి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎం.రమేష్ మహారాజ్ మాట్లాడుతూ భారత జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్ర్య సమర యోధుడుగా, అహింసావాదిగా, యావత్ భారతాన్నిప్రభావితం చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలతో అందరు ముందుకుసాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎం.ఏ. ఆలీం, సర్దార్ ఖాన్, జనార్దన్ రెడ్డి, కోర్వార్ నగేష్, సయ్యద్ షుకూర్, యూత్ కాంగ్రెస్ నాయకులు బోయ అశోక్ కుమార్, రాము, సత్యమూర్తి, ఎన్ఎస్‌యూఐ నాయకులు సందీప్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
