చలికాలం బెల్లం టీ బెస్ట్..!
– ఈ టీ తాగితే ఆరోగ్య సమస్యలు దూరం
– ఇంకా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఎన్నో
దర్శిని డెస్క్: ప్రతి సీజన్‌లో ఒక్కో దానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. చలికాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే బెల్లం టీ చాల బెస్ట్ అని నిపుణులు అంటున్నారు. ఈ కాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బెల్లంలో భాస్వరం, ఐరన్, సుక్రోజ్, విటమిన్లు ఏ, బి, పలు ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నందున ఈ శీతా కాలంలో బెల్లం టీ చాలా ఆరోగ్య కరంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. శీతా కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. తగినంత రోగ నిరోధక శక్తి అవసరం అవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి బెల్లం తీసుకోవడం చాలా మంచిది. బెల్లం తీసుకోవడం వల్ల అనేక పోషకాలు అందుతాయి. దీంతో శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ అనేవి పెరుగుతాయి.
శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి:
శీతా కాలంలో జలుబు, దగ్గు వంటివి కారణంగా చాలా మంది శ్వాస కోశ సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా.. శ్వాస కోశ మార్గాన్ని క్లియర్ చేయడానికి, గొంతు చికాకును తగ్గించడానికి బెల్లం టీ బాగా సహాయ పడుతుంది. అంతే కాకుండా జలుబు, దగ్గును కూడా నివారిస్తుంది.
జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది:
జీర్ణ సమస్యల్ని తగ్గించడంలో బెల్లం బాగా సహాయ పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మల బద్ధకాన్ని నివారించడంలో ఉపయోగ పడుతుంది. భోజనం తర్వాత మీరు తిన్న ఆహారం మెరుగ్గా జీర్ణం కావడానికి మీ టీలో బెల్లం చేర్చుకోవడం చాలా ముఖ్యం.
రక్త స్థాయిలను నిర్వహిస్తుంది:
బెల్లం టీ తీసుకుంటే శరీరానికి ఐరన్ బాగా అందుతుంది. ఇది ఆరోగ్యకరమైన రక్త స్థాయిలను నిర్వహించడానికి చాలా ముఖ్యం. సరైన మొత్తంలో బెల్లం వాడితే ఆక్సిజన్ సమర్థవంతంగా అన్ని భాగాలకు చేరుస్తాయి ఎర్ర రక్త కణాలు.
గమనిక: అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.
ఇదికూడా చదవండి…

