అవసరమైతేనే బయటకు రండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అవసరమైతేనే బయటకు రండి..!
– భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
– తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో తాండూరు పట్టణంతో పాటు మండలాల్లోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కూలీ పోయే ప్రమాదంలో ఉన్న ఇండ్లలో నివసించే ప్రజలు సురక్షిత నివాసాలకు తరలివెళ్లాలని అన్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలలో ఉండే ఇండ్లలోకి వర్షపునీరు చేరకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో పాటు గ్రామ సమీపంలోని చెరువులు, వాగుల వద్ద వెళ్లరాదని, పిల్లలు, యువకులు వెళ్లకుండా దృష్టిసారించాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ స్థంబాల వద్దకు, ఇంట్లో ఎలక్ట్రిక్ వస్తువుల నుంచి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు సురక్షితంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage