తెరిచిన గంటకే క్లోజ్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తెరిచిన గంటకే క్లోజ్..!
– మూత పడిన ఆధార్ కేంద్రాలు
– మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎంతో హడావుడిగా తెరిచిన ఆధార్‌ కేంద్రాలు మూతపడ్డాయి. తెరిచిన గంటకే క్లోజ్ కావడంతో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని నెలలుగా తాండూరు నియోజకవర్గంలో ఆధార్ ఆప్‌డేట్‌ కోసం వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. పట్టణంలోని పోస్టాఫీస్‌లో ఉన్న ఉన్న ఆధార్ సెంటర్‌కు వినియోగదారులు పొటెత్తడంతో దాడి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేతో పాటు అధికారులకు వినతులు వెల్లువెత్తాయి. దీంతో అధికారులు స్పందించి మంగళవారం తాండూరు పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో హడావుడిగా మూడు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మంగళవారం నుంచే సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించడంతో వినియోగదారులు పాత మున్సిపల్ కార్యాలయానికి పరుగులు తీశారు. తీరా తెరుచుకున్న గంటకే కేంద్రాలు మూతపడ్డాయి. నిర్వహకులు మధ్యాహ్నానికే తాళం వేసుకుని వెళ్లిపోయారు. నిర్వహకుల ఖాతాలు లాగిన్ కాకపోవడంతో సేవలు ప్రారంభించలేదు. తిరిగి బుధవారం ఉదయం నుంచి సేవలు ప్రారంభమవుతాయని, వినియోగదారులు ఉదయం రావాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!