మండల కేంద్రాల్లో ఇంటర్నేషనల్ స్కూళ్లు
– గురుకుల పాఠశాలల బలోపేతానికి కృషి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మండల కేంద్రాల్లో ఇంటర్నేషన్ స్కూళ్లు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం రాజీవ్ గృహ కల్ప కాలనీలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఆన్ లైన్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ ప్రచారాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వం ఇంటర్నేషన్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుందన్నారు.
తాండూరులో ఉన్న గురుకుల పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలన్నారు. మైనార్టీ స్కూల్లో ఉన్న అడ్మిషన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, వడ్డె శ్రీనివాస్, ప్రిన్సిపల్ గంగయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

