ఆర్టీసీ విలీనం హర్షణీయం..!
– తాండూరులో డీపోలో సంబరాలు
– సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించడం హర్షణీయమని తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సమత అన్నారు. తెలంగాణ రాష్ట్ర కేబినేట్ సమావేశంలో ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం విలీనం చేయాలని మంత్రి వర్గం నిర్ణయించడం పట్ల మంగళవారం తాండూరు ఆర్టీసీ డిపోలో సంబరాలు నిర్వహించారు. డిపో మేనేజర్ సమత ఆధ్వర్యంలో ఉద్యోగులు, సిబ్బందులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ కేసీఆర్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు. రానున్న రోజుల్లో ఆర్టీసీకి ఉత్తమ భవిష్యత్తు ఉంటుండన్నారు. ఎన్నో ఏండ్లుగా ఉద్యోగులు, సిబ్బంది, కార్మికుల కన్న కలలను సీఎం కేసీఆర్ సార్ధకం చేశారని అన్నారు. అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల ఉద్యోగులు, కార్మికులు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ యూనియన్ నాయకులు, ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

