రాజ్ కుమార్‌కు మహాత్మ జ్యోతిబా పూలే జాతీయ అవార్డు
– వచ్చేనెల 15న న్యూఢిల్లీలో ప్రధానం
– ప్రకటించిన జాతీయ అవార్డు కమిటీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుకు చెందిన బీసీ సంఘం నేత కందుకూరి రాజ్ కుమార్ మహాత్మ జ్యోతిబా పూలే జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని జాతీయ అవార్డు కమిటి సభ్యులు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమి జాతీయ కార్యాలయంలో సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ నల్లా రాధాకృష్ణ కందుకూరి రాజ్ కుమార్ కు అవార్డు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ బహుజన సాహిత్య అకాడమి ప్రతి యేటా ఉద్యమ కారులకు, సంఘ సేవకులకు, రచయిత, కవులకు, స్వచ్చంద సంస్థలకు మహాత్మ జ్యోతిబా పూలే జాతీయ అవార్డులను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా గత 30 ఏండ్లుగా బీసీ, ఎస్సీ, ఎసీ, మైనార్టీల సంక్షేమం కోసం పోరాడుతున్న రాజ్ కుమార్ కు జాతీయ అవార్డు కోసం ఎంపిక చేసినట్లు వివరించారు. అదేవిధంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ జాతీయ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వచ్చేనెల అక్టోబర్ 15వ తేదిన దేశరాజధాని న్యూఢిల్లీలో అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు. తనకు జాతీయ అవార్డును ప్రకటించిన బహుజన సాహితి అకాడమి అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం గౌతమ్ లకు రాజ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెలక్షన్ కమిటి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఎరన్ పల్లి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..

