ఆలుగ‌డ్డ జ్యూస్‌తో ఆమేజింగ్ లాభాలు..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

ఆలుగ‌డ్డ జ్యూస్‌తో ఆమేజింగ్ లాభాలు..!
– శరీరానికి ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ
– రోగ నిరోధక శక్తిని పెంపు
– మరిన్ని ప్రయోజనాలు తెలిస్తే విడిచిపెట్టరు
దర్శిని డెస్క్ : ఆలు గ‌డ్డ‌ను తింటే ప‌లు నొప్పులు వ‌స్తాయ‌నుకుంటారు కానీ ఆలుగ‌డ్డ జ్యూస్ ను తాగితే చాలా వ‌ర‌కూ లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆలుగ‌డ్డ క‌ర్రీ, ప్రై, ఆలు ట‌మాటా ఇలా ప‌లు రకాలుగా ఆలును తిని ఉంటాము. కాని ఆలుతో త‌యారుచేసిన జ్యూస్ తాగిఉండం. ఆలు జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల మానవురి శ‌రీరానికి చాలా ర‌కాలుగా ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ఓ స‌ర్వేలో వెలువ‌డింది. ఈ జ్యూస్ వ‌ల్ల మ‌న‌కు రోజువారిగా కావాల్సిన 40శాతం వ‌ర‌కూ బి విట‌మిన్లు ల‌భిస్తాయి. ఆలుగ‌డ్డ‌లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో శ‌రీరంలో రక్తం ప్ర‌స‌ర‌ణ స‌రిగా జ‌రుగుతోంది.

ఆలుగ‌డ్డ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల క‌ళ్ల కింద వ‌చ్చే న‌ల్ల‌ని మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి. ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఎటువంటి ఇన్ ఫెక్ష‌న్లు రాకుండా ఆలుగ‌డ్డ జ్యూస్ కాపాడుతోంది. పచ్చి బంగాళదుంప జ్యూస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంలో ముఖ్యంలో కాలేయం, ప్రేగుల్లో మరియు కిడ్నీల్లోని వ్యర్థాలను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది పొటాటో జ్యూస్ లో ఫైబర్, విటమిన్స్, మరియు మినిరల్స్ ఎక్కువగా ఉడే వ్యర్థాలను తొలగించడానికి రక్తం వడపోయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మైగ్రేన్‌తో బాధపడే వారు ఆలుగడ్డ జ్యూస్‌ను తాగితే ఫలితం ఉంటుంది.

బంగాళా దుంప జ్యూస్​ క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల సహజ శోథ నిరోధక శక్తి పెరుగుతుంది. హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మనల్ని ఎనర్జిటిక్​గా ఉంచుతుంది. కళ్లు, చర్మం, దంతాల ఆరోగ్యం, నాడీ వ్యవస్థ కూడా మెరుగవుతుంది. అజీర్తికి కూడా తోడ్పడుతుంది. చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అకాల వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. మెరుగైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. (గమనిక: ఇంటర్‌నెట్‌లో లభించిన సమాచారం మేరకు మాత్రమే ఇక్కడ అందించాం. ట్రైచేసే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!