చీ..చి.. ఇదేం పాడుపని డాక్టరూ..!

క్రైం తాండూరు వికారాబాద్

చీ..చి.. ఇదేం పాడుపని డాక్టరూ..!
– తన అశ్లీల వీడియో వాట్సాఫ్ లో పోస్టు చేసిన ఆర్ఎంపీ
– గ్రూపు సభ్యుని ఫిర్యాదుతో కేసు
– తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: సమాజంలో పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ ఆర్ఎంపీ డాక్టరు తాను చేసిన పాడుపనితో అందరిచేత చీ.. కొట్టించుకున్నారు. ఓ మహిళతో తీసుకున్న అశ్లీల వీడియోను వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడు. గ్రూపు సభ్యుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సబంధించిన వివరాలిలా ఉన్నాయి.

 

తాండూరు పట్టణంకు చెందిన అహమ్మద్ అనే వ్యక్తి స్థానికంగా ఆర్ఎంపీ డాక్టరుగా కొనసాగుతున్నారు. గత నెల 21న ఓ వాట్సాప్ గ్రూపులో ఓ మహళతో అశ్లీలంగా ఉన్న వీడియోను 9440767633 అనే నెంబరుతో ఏమరుపాటుగా పోస్టు చేశాడు. అదే గ్రూపులో సభ్యడుగా ఉన్న పట్టణంలోనీ గ్రీన్ సిటీ కాలనీకి చెందిన ఎజాజ్ అనే వ్యక్తి ఈ సంఘటనలోనీ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అతను ఆర్ఎంపీ డాక్టరనీ తెలిసింది. ఈ మేరకు పోలీసులు వీడియో పోస్టు చేసిన ఆర్ఎంపీ డాక్టరుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆర్ఎంపీ డాక్టరు చేసిన పాడు పనిని అందరు చీ.. కొడుతున్నారు.

 

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!