మ‌ద్యం దుకాణాల డ్రాకు ఏర్పాట్లు చేయండి

తాండూరు వికారాబాద్

మ‌ద్యం దుకాణాల డ్రాకు ఏర్పాట్లు చేయండి
– ద‌ర‌ఖాస్తు కేంద్రాన్ని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ నిఖిల‌
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి : వికారాబాద్‌లోని మ‌ద్యం దుకాణాల కేటాయింపు డ్రా కోసం స‌మ‌గ్ర ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం వికారాబాద్‌లోని శ్రీ‌శ‌క్తి భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ కేంద్రాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ అక‌స్మికంగా త‌నిఖీ చేశారు. జిల్లాలోని 5 మ‌ద్యం దుకాణాలకు సంబంధించిన వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌పై ఆరా తీశారు. దరఖాస్తు దారులతో మాట్లాడుతూ సమస్యలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు డీడీల‌ జారీ విషయంలో ఇబ్బందులు ఉన్నాయా ద‌ర‌ఖాస్తుల దారుల‌తో మాట్లాడారు. ఇందుకు వారు ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్‌కు బ‌దులిచ్చారు. అదేవిధంగా జిల్లాలో ఎస్సీ రిజర్వేషన్ క్రింద కేటాయించిన తొమ్మిది మద్యం దుకాణాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు.
అనంత‌రం గురువారం సాయంత్రంతో ద‌ర‌ఖాస్తుల గడువు ముగుస్తున్నందున్న ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను ఎలాంటి స‌మ‌స్య‌లు, ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాల‌ని ఎక్సెజ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. దీంతో పాటు ఈ నెల 20న శనివారం స్థానిక అంబేద్కర్ భావనంలో ఉదయం 11:00 గంటలకు డ్రాలు నిర్వహించేందుకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌న్నారు.

– వికారాబాద్ జిల్లాలో 255 ద‌ర‌ఖాస్తులు
జిల్లాలోని ఎక్సైజ్ శాఖ పరిధిలో మొత్తం 255 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని ఎక్సైజ్ సూప‌రిండెంట్ వ‌ర‌ప్ర‌సాద్ తెలిపారు. తాండూర్ స్టేషన్ పరిధిలో మొత్తం 17 షాపులకు గాను 75, వికారాబాద్ లో 15 షాపులకు 56, పరిగిలో 12 షాపులకు 81, కొడంగల్ లో 08 షాపులకు 23, మోమిన్ పెటలో 06 షాపులకు గాను 20 దరఖాస్తులు స్వీకరించినట్లు వెల్ల‌డించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ పల్లవి, ఐదు స్టేషన్ ల సిఐ లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.