మందుబాబులకు షాక్..!

క్రైం తాండూరు రాజకీయం

మందుబాబులకు షాక్..!
– ఒకరికి జైలు, మరో నలుగురికి జరిమాన
– వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ సంతోష్‌ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులకు తాండూరు న్యాయస్థానం జరిమాన, జైలు శిక్ష విధించింది. ఇందుకు సంబంధించి తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సోమవారం నిర్వహించిన వాహనాల తనిఖీలో పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ ఇంతియాజ్ మద్యం సేవించి ఆటో నడిపిస్తూ పోలీసులకు దొరికి పోయారు.

మరోసారి తనిఖీలో మరో నలుగురు వ్యక్తులు కూడా మద్యం సేవించి పట్టుబడ్డారు. దీంతో వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం తాండూరు సెకండ్ క్లాస్ జ్యూడిషీయల్ న్యాయమూర్తి నామాల అశోక్ ఆటో డ్రైవర్ ఇంతియాజ్‌ కు ఒకరోజు జైలు శిక్ష, రూ. 1000ల జరిమాన విధించారు. అదేవిధంగా మరో నలుగురు వాహనదారులకు రూ. 1500ల జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించినట్లు పట్టణ సీఐ సంతోష్‌ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!