కేటీఆర్ ప్రోగ్రాంలో చేంజ్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కేటీఆర్ ప్రోగ్రాంలో చేంజ్..!
– మార్పుకు కారణం ఏంటంటే..?
– వెల్లడించిన బీఆర్ఎస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వికారాబాద్‌ జిల్లా తాండూరులో నిర్వహించనున్న ప్రోగ్రాంలో చిన్న మార్పు జరిగింది. ఇందుకు కారణాలను స్థానిక నేతలు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈనెల 15వ తేదిన తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్ వినాయక కన్వెన్షన్ హాల్‌లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది.

కేటీఆర్‌తో పాటు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ కూడా పాల్గొంటారని ఇదివరకు నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో స్వల్ప మార్పులు జరిగినట్లు గురువారం బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రకటించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కోడ్‌ దృష్టిలో ఉంచుకుని మార్పు చేసినట్లు వెల్లడించారు. దీంతో పాటు ఏ క్షణంలో అయినా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉండడంతో ప్రోగ్రాంలో మార్పుకు మరో కారణమని తెలిపారు. షెడ్యూల్ అనంతరం కార్యక్రమం నిర్వహణను ప్రకటిస్తామని వివరించారు.

లోకల్ యాడ్…

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!