రేణుకా ఎల్లమ్మ మాతాకీ.. జై..!
– ముగిసిన జాతర ఉత్సవాలు
– దర్శించుకున్న ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి
– పూజలు నిర్వహించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
– వ్యాపారస్తులతో కలిసి భక్తులకు అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేణుకా నాగ ఎల్లమ్మ మాతాకీ.. జై.. అంటూ తాండూరు పట్టణం నెహ్రు గంజ్ ఆవరణలో వెలసిన అమ్మవారిని భక్తులు వేడుకున్నారు. శనివారం అమ్మవారి జాతర ఉత్సవాలు ముగిశాయి. జాతర ఉత్సవాల ముగింపు సందర్భంగా మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గంజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యారు. చైర్మన్ బాల్ రెడ్డి దిగ్రేన్ అండ్ సీడ్స్ ‘మర్చంట్స్ అసోసియేషన్ నేతలు, గంజ్ వ్యాపారులతో కలిసి అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అమ్మవారి కృప భక్తులందరిపై ఉండాలని ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రాములు గౌడ్, సభ్యులు పటేల్ శ్రీశైలం, కట్కం వీరేందర్, బంటారం సుధాకర్, భోజిరెడ్డి, పలువురు వ్యాపారులు, హమాలీ కార్మిక సంఘం నేతలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి ఆలయంలో అమ్మవారిని కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి దరి ్శంచుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటి సభ్యులు, వ్యాపారులు ఆయనను ఘనంగా సన్మానించారు.

