కూత పెట్ట‌నున్న ప్ర‌త్యేక రైళ్లు

జాతీయం తెలంగాణ హైదరాబాద్

కూత పెట్ట‌నున్న ప్ర‌త్యేక రైళ్లు
– దసరాకు తెలుగు రాష్ట్రాల్లో రైళ్ల ర‌వాణా
ద‌ర్శిని బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌త్యేక రైళ్లు కూత పెట్ట‌బోతున్నాయి. వ‌చ్చే దసరాపండ‌గ‌ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు రైల్వే స్టేషన్‌ల మీదుగా ప్రత్యేక రైళ్లను నడపబోతుంది. ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. తాజాగా మరికొన్ని ప్రత్యేక రైళ్ల వివరాలను వెల్ల‌డించింది. ఈ నెల 11 తేదీ నుంచి 26వ తేదీ వరకు మహారాష్ట్రలోని పూర్ణ రైల్వే జంక్షన్ – తిరుపతికి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. 11, 18, 25 తేదీల్లో పూర్ణ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను నపడనుండగా.. 12, 19, 26 తేదీల్లో తిరుపతి నుంచి పూర్ణకు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ రోజుల్లో పూర్ణ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 1 గం.కు బయలుదేరే ప్రత్యేక రైలు.. మరుసటి రోజు ఉదయం 8 గం.లకు తిరుపతికి చేరుకుంటుంది.

అలాగే పైన తెలిపిన తేదీల్లో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 8.15 గం.లకు బయలుదేరే ప్రత్యేక రైళ్లు.. మరుసటి రోజు మధ్యాహ్నం 3.25 గం.లకు పూర్ణ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

In order to clear extra rush during #Dussehra #festival , SCR will run the special trains between #Purna and #Tirupati

Tr. No. 07607 Purna-Tirupati on 11,18,25 Oct’2021
Tr. No. 07608 Tirupati – Purna on 12,19,26 Oct’2021@drmned @drmsecunderabad @drmhyb pic.twitter.com/V7XkoPA8fA

— South Central Railway (@SCRailwayIndia) October 8, 2021

అలాగే సికింద్రాబాద్-అగర్తలా మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. ఈ నెల 11 తేదీన (సోమవారం) మధ్యాహ్నం 4.35 గం.లకు సికింద్రాబాద్ నుంచి అగర్తలాకు ఓ ప్రత్యేక రైలు బయలుదేరి వెళ్లనుంది. ఈ ప్రత్యేక రైలు గురువారం వేకువజామున 3 గం.లకు అగర్తలా చేరుకుంటుంది. అలాగే ఈ నెల 15న ఎదురుదిశలో అగర్తలా నుంచి సికింద్రాబాద్‌కు ఓ ప్రత్యేక రైలు నడపనున్నారు. ఇది అగర్తలా నుంచి 15 తేదీన(శుక్రవారం) ఉదయం 6.10 గం.లకు బయలుదేరి.. శనివారం మధ్యాహ్నం 2.50 గం.లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లలో ఈ ప్రత్యేక రైళ్లు ఆగుతాయి.

Two Special Trains between Secunderabad – Agartala #SpecialTrains pic.twitter.com/1RrJuTYYe3

— South Central Railway (@SCRailwayIndia) October 8, 2021

అలాగే సికింద్రాబాద్-నర్సాపురం మధ్య, సికింద్రాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి 14వ తేదీన రాత్రి 10.55 గం.లకు బయలుదేరే ప్రత్యేక రైలు.. మరుసటి రోజు ఉదయం 10 గం.లకు నర్సాపురం చేరుకుంటుంది. అలాగే నర్సాపురం నుంచి సికింద్రాబాద్‌కు 17వ తేదీన సాయంత్రం 6 గం.లకు బయలుదేరే ప్రత్యేక రైలు.. మరుసటి రోజు వేకువజామున 4.10 గం.లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

14వ తేదీన రాత్రి 8 గం.లకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ప్రత్యేక రైలు.. మరుసటి రోజు ఉదయం 7 గం.లకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. అలాగే 17వ తేదీన రాత్రి 8.45 గం.లకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరే ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 8.25 గం.లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.