నైరుతి.. ఎంట్రీ..!
– తెలంగాణకు తాకిన పవనాలు
– ఉక్కపోతలకు ఇక టాటా
– మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఇంకెన్నాళ్లు.. ఉక్కపోతలు బాబోయ్ అని కలవర పడే ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్తను అందించింది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు తెలంగాణకు తాకాయని వెల్లడించింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు.. ఏపీ, మహారాష్ట్రలో 30శాతం విస్తరించినట్లు తెలిపారు.

నైరుతి రుతుపవనాలు ఆగమన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు నైరుతి రుతువనాలు బంగాళాఖాతంలో పూర్తిగా వ్యాపించినట్లు పేర్కొన్నారు.

ఇప్పటికే అక్కడక్కడ కురిసిన తేలికపాటి వర్షాలతో ఎండల తీవ్రత తగ్గి, వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తాజాగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రాలను తాకడంతో ప్రజలు ఉక్కపోతలకు టాటా చెప్పినట్లు అయ్యింది.



