సర్ విజయవంతానికి కృషి
– ఈనెల 7న తాండూరులో శిక్షణ కార్యక్రమం
– హాజరు కానున్న రాష్ట్ర కన్వీనర్, డీసీసీ అధ్యక్షులు
– తాండూరు నియోజకవర్గ సర్ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తాండూరు నియోజకవర్గ కన్వీనర్, టీపీసీసీ ప్రచార సమన్వయ కర్త కరణం పురుషోత్తంరావు తెలిపారు.

గురువారం టీపీసీసీ అధిష్టానం ఆదేశాల మేరకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచనతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు నియోజకవర్గ సర్ కార్యక్రమ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరణం పురుషోత్తం రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 7న బీఎల్‌ఏలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఆదివారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని తులసీ గార్డెన్స్ ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిధిగా సర్ రాష్ట్ర కన్వీనర్, పరిగి ఎమ్మెల్యే టి. రాం మెహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారసింగ్ తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న 269 బీఎల్‌ఏలతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు, మండల, గ్రామ, మున్సిపల్ వార్డు పార్టీ అధ్యక్షులు, ఆత్మ కమిటీ చైర్మన్,మర్కేట్ కమిటీ చైర్మన్స్, వైస్ చైర్మన్స్, పీఏసీఎస్ చైర్మన్స్, వైస్ చైర్మన్స్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, పాలక వర్గ సభ్యులు, కౌన్సిలర్స్, సర్పంచ్ లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, కోట్‌పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ అంజయ్య, తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, వడ్డె శ్రీనివాస్, సీనీయర్ నాయకులు జనార్దన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, తాండూరు మండల అధ్యక్షులు రాజ్ కుమార్, బషీరాబాద్ అధ్యక్షులు రాజవర్దన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


