జన హృదయ నేత పైలెట్ రోహిత్ రెడ్డి
– వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపు ఖాయం
– శుభాకాంక్షలు తెలిపిన విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రజల్లో జన హృదయ నేతగా పైలెట్ రోహిత్ రెడ్డి నిలుస్తారని మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు.

ఆదివారం హైదరాబాద్లో జరిగిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకల్లో విఠల్ నాయక్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేయించి తినిపించారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ తాండూరు అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు రోహిత్ రెడ్డి అని అన్నారు.

ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా దాటుకుని వస్తారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యేగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి. బాణాపూర్ మాజీ సర్పంచ్ గోపాల్, పార్టీ సీనియర్ నాయకులు రాజు నాయక్, జర్పుల గోపాల్ నాయక్, పిట్ల నర్సిములు, హరీష్ కూమార్ తదితరులు ఉన్నారు.



