సత్తా చాటిన గురుకుల అమ్మాయిలు
– ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు
– టీఎస్ఆర్ గర్ల్స్ కాలేజీలో 90శాతం పైగా ఉత్తీర్ణత
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గం ఖాంజాపూర్ గేటు సమీపంలోని టీఎస్ఆర్ స్కూల్, బాలికల జూనియర్ కాలేజీ అమ్మాలు సత్తా చాటారు. బుథవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. కాలేజీ నుంచి ప్రథమ సంవత్సరంలో 90 శాతం, ద్వితీయ సంవత్సరంలో 95.4శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో పి.వర్షిణీ 467/470, ఎ.అక్షిత 466/470, డీ. శ్రీలత 463/470, బైపీసీలో బీ.మమత 436/440, సానియా హన్హా 433/440, ఎం. అనిత 433/440, ద్వీతీయ సంవత్సరం బైపీసీలో ఆర్. ఇందు 983/1000, వి. మహేశ్వరీ 979/1000, ఎం. వైషని 979/1000, విష్ణుప్రియ 978/1000, ఎంపీసీలో ఆర్.సైత 980/1000, బీ. అనూష 970/1000, కె. మాధవి 968/1000లు అత్యుత్తమ మార్కులు సాధించారు. ఇంటర్ ఫలితాల్లో గురుకుల కాలేజీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల కాలేజీ ప్రిన్సిపల్, అద్యాపకులు హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు.

ఇదికూడా చదవండి…

