వెంక‌ట‌య్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

వెంక‌ట‌య్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి
పెద్దేముల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మార్కెట్ క‌మిటి మాజీ వైస్ చైర్మ‌న్ డీవై వెంక‌ట‌య్య కుటుంబాన్నిఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. పెద్దేముల్ మండ‌లానికి చెందిన డీవై వెంక‌ట‌య్య గురువారం క‌న్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న మ‌హేంద‌ర్ రెడ్డి వెంక‌ట‌య్య నివాసానికి చేరుకున్నారు. కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని ప్ర‌క‌టించి ఓదార్పు అందించారు. ఎమ్మెల్సీ వెంట మండ‌ల సీనీయ‌ర్ నాయ‌కుల‌తో పాటు పార్టీ నాయకులు, కార్య‌క‌ర్త‌లు ఉన్నారు.