యూత్ కాంగ్రెస్ సత్తా చూపండి
– భారీ మెజార్టీలో మీరే కీలకం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– హాజరైన నేషషనల్ సెక్రటరీ జీషన్ హైమద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు యూత్ కాంగ్రెస్ సత్తా మరోసారి చూపించాల్సిన సమయం వచ్చిందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం యాలాల మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బస్వరాజ్ అధ్యక్షతన చేవేళ్ల పార్లమెంట్ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరుకాగా ఆయనతో పాటు యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ జీషన్ హైమద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణం రాజు, తాండూరు అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కృషి వల్ల యాలాల మండలం నుంచి అత్యధిక మెజార్టీ సాధించడం జరిగిందని గుర్తుచేశారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా యూత్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం నిరంతరం కృషిచేయాలన్నారు. పార్లమెంట్‌లో కూడా భారీ మెజార్టీ అందించేలా సత్తా చాటాలన్నారు. రంజిత్ రెడ్డికి తాండూరు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ అందించాలన్నారు.

అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ పథాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు భీమప్ప, హన్మంతు ముదిరాజ్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

