కారులోనే చెరుకు బండి..!
– మ్యాన్ ఐడియా యమ పాపులర్
– సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
దర్శని డెస్క్: చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను ఆకట్టుకునేందుకు రకరకాల ఐడియాలో వేస్తుంటారు. అందులో కొన్ని హిట్టై ప్రాఫిట్ కూడా ఇస్తుంటాయి. ఇలాంటి ఐడియాతో ఓ వ్యక్తి వినియోగించుకున్న ఐడియా యమ పాపులర్ అయ్యింది. అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చూసిన నెటిజన్లు అంతా వారెవ్వా.. ఏం ఐడియా గురూ! అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదైనా ప్రాంతంలో వీధికి వెళితే అక్కడ రోడ్డు పక్కన తిను బండారాలు, జ్యూస్‌లు, ఐస్ క్రీంలు విక్రయించే చిరు వ్యాపారులు తప్పక కనిపిస్తారు. ఇలాంటి వీధి వ్యాపారులకు డిమాండ్ కూడా ఫుల్‌గానే ఉంటుంది. ఎగబడి మరీ జనాలు కొనేస్తుంటారు. సాధారణంగా ఇలాంటి చిరు వ్యాపారులు తోపుడు బండ్లు లేదంటే సైకిల్ బండ్లతో కనిపిస్తుంటారు.
తాజాగా ఓ వ్యక్తి మాత్రం ఏకంగా కారులోనే దుఖాణం తెరిచాడు. ఎండలకు చల్లని పానియాలు అందిస్తూ స్థానికంగా యమ పాపులర్ అయ్యాడు. ఇతనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కనిపించే వ్యక్తి కూడా చెరకు రసాన్ని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. అయితే అందుకు ఏకంగా తన కారునే ఉపయోగించుకున్నాడు. కారులో చెరకు రసం తీసే యంత్రాన్ని అమర్చి ఉండటం వీడియోలో చూడొచ్చు. కారు టాప్ పార్ట్‌లో కొన్ని చెరకు గడలు కట్టి ఉండటం వీడియోలో కనిపిస్తాయి. తన వాహనంలో ఈ వ్యక్తి చెరుకు రసం తీసే యంత్రాన్ని అమర్చి రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. చప్రాజిలా అనే యూజర్ ఎక్స్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశాడు. ‘భారతదేశంలో ఏదైనా సాధ్యమే.. కారులోనే చెరకు యంత్రాన్ని అమర్చాడు’ అనే క్యాప్షన్‌తో వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘అహా ఏం ఐడియా గురు..’ అంటూ కామెట్లు చేస్తున్నారు. కింద లింకులో వీడియోను మీరు ఓ లుక్కేయండి…
भारत में कुछ भी संभव हैं कार में ही लगा दिया गन्ने का मशीन 😜😅 pic.twitter.com/hzc7a9hyvy
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) May 9, 2024
ఇదికూడా చదవండి…

