ముగిసిన నామినేషన్ల పర్వం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ముగిసిన నామినేషన్ల పర్వం..!
– మూడో రోజు 165 దాఖలుతో 273 చేరిన సంఖ్య
– బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా ఖరారు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్లో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈనెల 28వ తేది నుంచి తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యింది.

ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొదటి రోజు 11 నామినేషన్లు రాగా రెండో రోజు గురువారం 97 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు కావడంతో శుక్రవారం నామినేషన్లు భారీగా దాఖలు అయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజు ఆయా పార్టీలు అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 165 నామినేషన్లు దాఖలు చేసుకున్నారు. మూడు రోజులుగా నమోదైన దాఖలుతో నామినేషన్ల సంఖ్య 273కు చేరుకుంది. అదేవిధంగా ఆయా పార్టీలు, స్వతంత్రులు కలిపి ఎన్నికల్లో పోటీ చేసే వారి సంఖ్య 190 మందికి చేరింది. శనివారం నామినేషన్ల పరిశీలన జరిపి అర్హులై అభ్యర్థుల వివరానలు ప్రదర్శిస్తామని కమీషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు.

ఇదికూడా చదవండి…

మా కోడలును ఆశీర్వదించండి..!