చైర్ పర్సన్ వర్సెస్ ఆఫీషియల్స్
– ఎంజెడాపై స్టేతోనే పీఆర్సీకి అడ్డంకులు
– కోర్టులో పిటీషన్ వేసింది చైర్ పర్సనే
– కోర్టు ఉత్తర్వులు వచ్చేంత వరకు నో పీఆర్సీ
– మీడియా సమావేశంలో ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ లో చైర్ వర్సెస్ ఆఫీషియల్స్ మద్య వివాదం వేడెక్కుతోంది. పీఆర్సీ కోసం సమ్మె చేపట్టిన కార్మికులకు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మద్దతు తెలుపుతూ చేసిన ఆరోపణలు వివాదం మరింత ముదిరిందనే పరిణామాలు కనిపిస్తున్నాయి. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ మీడియాతో సమావేశం నిర్వహించి పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ యేడాది జనవరి 22న మొత్తం 48 అంశాలతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, అందులోనే 23వ అంశం కింద ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్మికుల పీఆర్సీ అంశాన్ని పొందుపరడం జరిగిందని గుర్తుచేశారు. ఆ రోజు జరిగిన సమావేశానికి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరు కావడం జరిగిందని, 25 మంది మెజార్టీ సభ్యుల తీర్మానంతో ఎజెండాను ఆమోదించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఇందుకు అన్ని ఆధారాలు కూడ ఉన్నాయని అన్నారు. అయితే ఆమోదించిన ఎజెండాను వాయిదా వేయాలని చైర్ పర్సన్ నెల 25న కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేయడంతో కోర్టు ఎజెండాపై స్టే విధించిందన్నారు. దీనిపై 5,6 దఫాల తరువాత కోర్టు స్పందించి ఈ విషయాన్ని ప్రభుత్వం ద్వారానే తేల్చుకోవాలని, చీఫ్ సెక్రటరీని నుంచి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఆ తరువాత కోర్టుకు సెలవులు రావడం.. న్యాయమూర్తుల మార్పు కారణాలతో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి రాలేదని తెలిపారు. కోర్టు ఉత్తర్వులు ప్రభుత్వం ద్వారా చీప్ సెక్రటరీకి అందితే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. చైర్ పర్సన్ కోర్టులో రిట్ పిటీషన్ వేయడం వల్ల కోర్టు నుంచి స్టే రావడంతో కార్మికులకు పీఆర్సీని అమలు చేయడంలో జాప్యం జరిగిందన్నారు. కోర్టు నుంచి రావాల్సిన ఉత్తర్వులు ప్రభుత్వం దృష్టిలోకి రాకపోవడంతో పీఆర్సీ అమలుకు అడ్డంకులు వస్తున్నాయని, దీనిపై మున్సిపల్ నుంచి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అధికారం లేదని స్పష్టం చేశారు. కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కార్మికుల పీఆర్సీ అంశం కోసం నోటీసు ఇవ్వలేదు
ఎజెండా పై సంతకం లేకుండా సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ చైర్ పర్సన్ కోర్టుకు వెళ్లినట్లు చేసిన వాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. చైర్ పర్సన్ తాజాగా కార్మికుల అంశంపై సమావేశం నిర్వహించాలని ఇన్‌వార్డులో నోటీసు ఇవ్వడం జరిగిందని, అయితే కార్మికులు ఈనెల 5వ తేదిన సమ్మెకు దిగితే.. చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ 9వ తేదిన ఇన్ వార్డులో నోటీసు ఇచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ రంగనాథం, మేనేజర్ నరేందర్ రెడ్డిలు ఉన్నారు.

