బీసీల సమస్యలపై ఉద్యమిస్తా
– జాతీయ కార్యవర్గ సభ్యులు కె.రాజ్ కుమార్
– సన్మానించిన టీఆర్ఎస్ యువజన నాయకులు
తాండూరు, దర్శినిప్రతినిధి : బీసీల సమస్యలు, అభివృద్ధికి మరింత ఉద్యమిస్తానని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ పేర్కొన్నారు. జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియామకమైన సందర్భంగా బుధవారం కందుకూరి రాజ్ కుమార్‌ను తాండూరు పట్టణ తెరాస యువజన విభాగం అధ్యక్షులు అనిల్ బాండ్, పట్లోళ్ల గంగాధర్‌ల ఆధ్వర్యంలో పలువురు శుభాకాంక్షలు తెలిపి.. ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు అన్ని రంగాల్లో హక్కులు పొందేవిధంగా ఉత్సహాంగా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం సభ్యులు రమేష్ టైలర్, ఇలియాజ్, హైమద్, అక్బర్, రవి, రఫీ,శాబాజ్ సాయి, ఖలీద్, శేఖర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


