వైశ్య ఫెడరేషన్ సేవ భేష్..!
– అన్నదానాన్ని సద్వినియోగం చేసుకోవాలి
– తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
– 10వ రోజు కొనసాగిన అన్నదాన సేవ
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల కోసం వైశ్య ఫెడరేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు భేష్ అంటూ తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఫెడరేషన్ సేవలను కొనియాడారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర యూత్ సెక్రటరీ, తాండూరు ఆర్యవైశ్య సంఘం కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెరడేషన్ సహాకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మంగళవారం పదో రోజు తాండూరుకు చెందిన కల్వ గీత, రాజశేఖర్ దంపతుల వివాహా వార్షికోత్సవం సందర్భంగా అందించిన సహాయంతో చేపట్టిన అన్నదాన కార్యక్రమానికి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి రొంపల్లి సంతోష్ కుమార్, సభ్యులతో కలిసి పేదలకు అన్నదానం చేశారు. అనంతరం డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో పేదల కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం భేష్ అన్నారు. మండుటెండలో ఎవ్వరు చేయని విధంగా పేదల ఆకలిని తీర్చేందుకు అన్నదానంకు ముందుకు రావడం స్పూర్తిదాయకమన్నారు.

ఇలాంటి సేవా కార్యక్రమాలకు వైశ్య ఫెడరేషన్ ఆదర్శనిలవడం హర్షణీయమన్నారు. పేదలు వైశ్య ఫెడరేషన్ అన్నదాన సేవా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు కార్యక్రమానికి హాజరైన డీఎస్పీ బాలకృష్ణారెడ్డిని రొంపల్లి సంతోష్ కుమార్, సంఘాల సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్, కార్యదర్శి కోడూరి వినోద్ కుమార్, ఆకారపు శివకుమార్, వాసవిక్లబ్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

